calender_icon.png 14 August, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంనగర్ ప్రాంతంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా

14-08-2025 08:41:04 PM

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ ప్రాంతంలో నూతన బ్రిడ్జి మంజూరుకు కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) తెలిపారు. గురువారం సాయంత్రం వరద నీరు చేరిన రామ్ నగర్ బ్రిడ్జి ప్రాంతాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో చర్చించి ఈ సెప్టెంబర్ నెలలోనే నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్షాలకు ప్రజలు ఎవరు బయట తిరగవద్దని సూచించారు.

మున్సిపల్ ఆధ్వర్యంలో జెసిబి ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించిన చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. రాంనగర్ ప్రాంతవాసులు మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. ఎమ్మెల్యే వెంట బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, ఏసిపి ఏ. రవికుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్యతో పాటు పలువురు నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.