13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

23-03-2026 04:03 PM

బేల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బేల మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. వివిధ గ్రామాల నుండి ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని తమ పేర్లను నమోదు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమానికి ఐ.కె.పి, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సహకరించారు. ఈ సందర్బంగా స్థానిక పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ  ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరం ఉన్న రోగులకు మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు.