13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి

23-03-2026 03:58 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిడిపి నాయకులు సోమవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతి పత్రమును అందజేశారు. సర్కిల్ పరిధిలోని ఏదులాబాద్ డివిజన్ పరిధిలో గత నెల రోజుల నుండి మిషన్ భాగీరధ త్రాగునీరు సక్రమంగా సరఫరా జరుగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఎండల తీవ్రత రాకముందే నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఏప్రిల్, మే నెలల్లో ఎండాకాలం పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన కలుగుతున్నదని, గతంలో ఎప్పుడు లేనంతంగా త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. కనుక ప్రధానంగా 6, 7 డివిజన్ ల పరిధిలో త్రాగునీటి ఇబ్బందులు తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు వేముల సంజీవ గౌడ్, శిష్ట సూర్యనారాయణ, పాటి సురేందర్ రెడ్డి, మడ్డి రాములు వినతి పత్రంలో కోరారు.