calender_icon.png 13 July, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీ యాక్షన్

13-07-2025 12:59:04 AM

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాశ్‌రాజ్, శ్రియరెడ్డి కీలక పాత్ర లు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ తాజాగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్‌తో ఫైర్ చేస్తున్న పవన్‌కల్యాణ్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అటు యాక్షన్ ప్రియులు, ఇటు మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఈ చిత్రం రూపొందుతోందని టీమ్ చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్; ఛాయాగ్రహణం: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి.