13-07-2025 12:57:42 AM
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి కాగా.. ఆయన 157వ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అప్ డేట్స్ విషయంలో ‘విశ్వంభ ర’ అభిమానులను ఒకింత నిరాశకు గురిచేస్తుంటే.. ఆ తర్వాత అనిల్ రావిపూడి పట్టాలెక్కించిన సినిమా తీపి కబుర్లతో ఆ మూవీ టీమ్.. మెగాస్టార్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. చిరంజీవి కథానాయకుడిగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ‘మెగా157’ అనే వర్కిం గ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది.
చిరంజీవి ఈ సినిమాలో తన అసలు పేరు ‘శివశంకర్ వరప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇది వచ్చే సంక్రాంతి రిలీజ్ కానుండటంతో పండుగ నేపథ్యానికి తగ్గట్టుగా టైటిల్ ఉంటుందంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సరికొత్త పేరును ఫిక్స్ చేశారనేది ఇండస్ట్రీలో తాజాగా వినవస్తున్న టాక్. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా చిత్రబృందం భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అదే రోజు ఓ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ద్వారా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారట.
ఈ సినిమాలో తాను అతిథి పాత్రలో కనిపించనున్నట్టు వెంకటేశ్ ఇటీవలే కన్‌ఫార్మ్ చేశారు. చిరంజీవి పాత్ర డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ అని తెలిసినప్పటి నుంచి వెంకటేశ్ పాత్ర ఏమై ఉంటుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇందులో నయనతార కథానాయికగా కాగా, కేథరిన్ టెస్రా, బలగం మురళీధర్ గౌడ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.