calender_icon.png 13 July, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాల్లో తెలుగు విద్యార్థుల ప్రయాణమే కథగా..

13-07-2025 01:00:27 AM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం ‘వీఐఎస్‌ఏ: వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ఆవిష్కరణ శనివారం జరిగింది. 

అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందం గా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.