డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం
26-06-2024 01:46 AM
చార్మినార్, జూన్ 25 : స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ సీసీఎస్ హైదరాబాద్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా చేసిన దాడుల్లో పాతబస్తీ బండ్లగూడ ఆల్ జుబైల్ కాలనీకి చెందిన మహ్మద్ షాన్ పహాద్ నుంచి 190 మెఫెంటర్‌మైన్ వైల్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని విచారణ నిమిత్తం చార్మినార్ జోన్ హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు అప్పగించారు. ఈ దాడుల్లో స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ సీసీఎస్ డీడీ డి.బిక్షపతి, సీఐ ఎండీ జియా, శ్రీశైలంలతో పాటు పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.






