23 May, 2026 | 12:54 AM

వడ్లు, మొక్కజొన్న పంటలను తక్షణం కొనుగోలు చేయాలి

23-05-2026 12:00 AM

కరీంనగర్,నాయ్22(విజయక్రాంతి): వడ్లు, మొక్కజొన్న పంటలను తక్షణం కొనుగోలు చేయాలని , కొనుగోలు కేంద్రాల్లో రై తులు ఎదుర్కొంటున్న సమస్యల ను వెంట నే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బిజెపి నిరసన, ఆం దోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రా లు సకాలంలో ప్రారంభించకపోవడం, ప్రా రంభించిన మందకుడిగా కొనుగోళ్లు సాగడంతో రైతులు వారాల తరబడి మార్కెట్ యార్డులలో పడిగా గాపులు కాస్తున్నారన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అదునుగా భా వించిన దళారులు , కొంతమంది అధికారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దళారులు, ట్రేడర్లు రైతును నిలువు దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని, రైతులను దోచుకోండని కాంగ్రెస్ ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లు ఉందని, ప్ర స్తుత పరిస్థితులను చూస్తుంటే అదే విషయా న్ని స్పష్టం చేస్తుందన్నారు. అసలు కాంగ్రెస్ సర్కార్కు రైతులపై ఇంత కక్ష సాధింపు ఎం దుకు ..? ఆయన ప్రశ్నించారు. వడ్ల లో బి కేటగిరి దోపిడీని అరికట్టాలని, సంచులు, ర వాణాలో అదనపు చార్జీలు రద్దు చేయాలని , రవాణా కోసం తగిన లారీలు ఏర్పాటు చే యాలని, తాలు, తరుగు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో  నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళ రమేష్ , బిజెపి సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ ,బత్తుల లక్ష్మీనారాయణ ,జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కర చారి, వైద రామానుజం ,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ నాంపల్లి శ్రీనివాస్, పుప్పాల రఘు, గణపతి, దండు కొమురయ్య ,కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బండారి వేణు, ఒంటెల సత్యనారాయణ, సోమిడి వేణు, తాటికొండ ప్రభావతి ,మునీందర్ ,

రవీందర్ బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు ,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ ,ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ,మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి , దొంతు రమేష్ ర్యాకం శ్రీనివాస్ తూర్పాటి రాజు చింతం శ్రీనివాస్, కుంట తిరుపతి, జాడి బాల్ రెడ్డి, అవదుర్తి శ్రీనివాస్, బండారి గాయత్రి, పాదం శివరాజ్, తణుకు సాయి కృష్ణ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శశి, సంఘ నరేష్, సంకిటి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ పటేల్ ,కచ్చకాయల రాజు, నాంపల్లి రమేష్ బిజెపి రాష్ట్ర జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.