26-07-2024 03:09:01 PM
కాలేశ్వరంలోని లక్ష్మి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలి
అసెంబ్లీ సమావేశాల్లోపు నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకులుపై కోపం ఉంటే తమ మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాలేశ్వరం నుండి లక్ష్మి పంప్ హౌస్ వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎల్ఎండి నింపినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో నీళ్లు అందుతాయన్నారు.ఇప్పటికే నియోజకవర్గంలో చాలా వరకు రైతులు వేలే ఎకరాల్లో నాట్లు వేసి ఉన్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు కోదాడ వరకు ఈ నీళ్లు అందుతాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యే లోపు పంప్ హౌస్ లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులందరినీ తీసుకువచ్చి పంప్ హౌస్ ఆన్ చేసి మిడ్ మానేరు, ఎల్ఎండి నింపుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.