10-11-2025 06:04:25 PM
అచ్చంపేట: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో భాగమైన సోమవారం సందర్భంగా అచ్చంపేట పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో భక్తులు శివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయంలో ఉసిరి చెట్టుకు పూజలు చేసి దీపాలు వెలిగించారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద ఉసిరి చెట్టు కింద భోజనాలు చేశారు. మహిళలు బతుకమ్మలు కోలాటాలు ఆడుతూ సరదాగా గడిపారు.
కార్యక్రమంలో మహిళ సంఘం అధ్యక్షురాలు దాసుపత్రి శకుంతల, వనం గీత, గుర్రం హైమావతి, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, దాసు జంగమ్మ, వర్కాల బాలకిష్టమ్మ, క్యామ తిరుపతమ్మ, కుకుడాల నారాయణమ్మ, మాకం పద్మ, కర్నాటి బాలమణి, వనం శ్రీదేవి, ఎల్లికంటి సావిత్రి, ఏలే విశాల తదితరులు పాల్గొన్నారు.