08-12-2025 12:39:19 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ పద్మశాలీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనను యూనియన్ నేతలు విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఈగ వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యదర్శిగా తిరందాసు యాదగిరి, కోశాధికారిగా బాలకృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎలగందుల రాహుల్ కుమార్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా యాదగిరింధర్, వీ. శ్రీనివాస్, పిట్ల ఉమాదేవితోపాటు మరికొందరిని కార్యవర్గంలో ఎన్నుకున్నట్లు తెలిపారు.