calender_icon.png 12 May, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్‌కు జోడీగా..

12-05-2025 02:04:12 AM

ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం ‘ఎన్టీఆర్ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉండగా.. దీనికి ‘డ్రాగన్’ అనే పేరును అనుకుటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోందని టాక్. తాజాగా ఈ ప్రాజెక్టులో మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారని వినవస్తోంది.

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ను ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఈ చిత్రంలో ఆమె పాత్ర కథకు అనుగుణంగా సెకండ్ హాఫ్‌లో మెరవనుందని సమాచారం. తారక్, శ్రద్ధా మధ్య ఓ పాట కూడా ఉండనుందని తెలుస్తోంది.

మేకర్స్ ఇప్పటికే శ్రద్ధాతో చర్చలు ప్రారంభించేరని ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో టాక్ వినవస్తోంది. శ్రద్ధా కపూర్ గతంలో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. అప్పుడీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత శ్రద్ధా తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు.