పాక్ కు మన సత్తా తెలిసింది
17-05-2025 11:40 PM
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రాజేంద్రనగర్: యుద్ధంతో పాకిస్తాన్ కు మన సత్తా ఏంటో తెలిసి వచ్చిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశ ఐక్యతకు, త్రివిధ దళాల సేవలకు కృతజ్ఞతగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నిర్వహించిన ’తిరంగ యాత్రను’ అయన రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాటేదాన్ లోని బీజేపీ కార్యాలయం నుంచి భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాక్ ఇప్పటికైనా తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం తదితరులు పాల్గొన్నారు.






