calender_icon.png 18 May, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

18-05-2025 12:00:00 AM

- సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుళ్ళ పద్మారావు గౌడ్

- లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వారసిగుడ. మే 17(విజయక్రాంతి) : గత కేసిఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి వివిధ పధకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు.

సికింద్రాబాద్ నియోజ కవర్గానికి సంబంధించి మారేడుపల్లి, ముషీరా బాద్ మండలాలకు చెందిన 255 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీతాఫలమండీ చౌరస్తాలో పద్మారావు గౌడ్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సంబంధించి చేసిన హామీలు నెరవేర్చాలని సూచించారు.

ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి ప్రభుత్వం వద్ద నిధులు లేవని పదే పదే పేర్కొనడం సరికాదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో నిరంతరం తాము ప్రజలకు అండగా నిలుస్తున్నామని, సీతాఫలమండీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే పద్దతిని పద్దతిని పాటిస్తున్నామని తెలిపారు.

కార్యకర్తలకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామ ని, ఏ అవసరానికైనా ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. మారేడుపల్లి ఏంఆర్‌ఓ భీమయ్య గౌడ్, ముషీరా బాద్ ఏంఆర్‌ఓ ప్రతాప్ సింగ్, కార్పొరేటర్లు సామల హేమ, వెంకట లక్ష్మీ, కార్పొరేటర్లు సామాల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, రాసురి సునీత, తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి మండ లానికి చెందిన 159 మందికి, ముషీరాబాద్‌కు చెందిన 96 మందికి రూ.2.55 కోట్ల మేరకు విలువజేసే చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు.