19 June, 2026 | 3:32 AM

విశాఖపై పాక్ గురి!

19-06-2026 02:34 AM
  1. బంగాళాఖాతంలో పాక్ సబ్‌మెరైన్లను మోహరించే అవకాశం
  2. చైనా నుంచి కరాచీ పోర్టుకు హంగోర్ జలాంతర్గామి
  3. సముద్ర జలాల్లో భారత్‌కు మరింత అప్రమత్తత అవసరం

కరాచీ, జూన్ 18: విశాఖపై పాకిస్తాన్ గురిపెట్టినట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో పాక్ సబ్‌మెరైన్లను మోహరించేందుకు సిద్ధమవుతున్నట్లు ఉంది. పహల్గాం దాడుల తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో గట్టి ఎదురుదెబ్బలు తిన్న పాకిస్తాన్ ఇప్పుడు రూటు మారుస్తోంది. భారత్ పై ఏదో విధంగా పైచేయి సాధించేందుకు మిత్రదేశం చైనా సాయం తీసుకుంటోంది. అలాగే భూతల, గగనతల యుద్ధాల కంటే జల యుద్ధానికి సిద్ధమవుతోంది.

ఇందులోనూ భారత్‌ను ఎదుర్కో వడం సాధ్యం కాదని తెలిసినా చైనా సాయం తో ఈ దుస్సాహసానికి పాల్పడుతోంది. ఇం దులో భాగంగా తమకు ఎలాంటి సంబంధం లేని బంగాళాఖాతంలో చైనా నుంచి తెచ్చుకున్న జలాంతర్గాముల్ని మోహరిస్తోంది. అదీ 1971 తర్వాత తొలిసారి ఇందుకు ప్రయత్నిస్తోంది. దీనికి పాకిస్తాన్ తొలి హంగోర్- క్లాస్ జలాంతర్గామి కరాచీ పోర్టుకు చేరుకోవడం, పాకిస్తాన్ ఫ్లీట్ కమాండర్ వైస్ అడ్మిరల్ అబ్దుల్ మునీబ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి.

దీంతో సముద్ర జలాల్లో భారత్‌కు మరింత అప్రమత్తత అవసరం అనే ది స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ తమ నౌకాదళంలోకి కొత్తగా హంగోర్ శ్రేణి జలాంత ర్గాములను కొనుగోలు చేసే ప్రణాళికల్లో స్పీడ్ పెంచింది. చైనా నుంచి 8 హంగోర్ సబ్‌మెరైన్ల కొనుగోలకు ఒప్పందం చేసుకుంది. ఇందులో ఒకటి ఇటీవల పాక్‌కు అందింది. దీనికి ఎస్కార్ట్‌గా ఉన్న ఫ్లోటిల్లా నౌక కమాండర్ కమోడోర్ ఒమర్ ఫరూఖీ మార్గమధ్యలోని శ్రీలంకలో నిలిపారు.

అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. హంగోర్ జలాంతర్గాములతో  తమ దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుందని తెలిపారు. వీటితో తాము బంగాళాఖాతంలోనూ తమ సైనిక శక్తిని మోహరించ వచ్చని పేర్కొన్నారు. ఇవి గేమ్ చేంజర్ సబ్‌మెరైన్లని వెల్లడించారు. ఈ సరికొ త్త సబ్‌మెరైన్ సహాయంతో బంగాళాఖాతంలో తిరిగి తమ నౌకాదళ ఉనికిని బలంగా చాటుకోవాలని పాకిస్థాన్ వ్యూహాత్మకంగా అడుగు లు వేస్తోంది.

బంగాళాఖాతాన్ని ప్రాదేశిక సముద్రంగా గుర్తిస్తుండడంతో ఇక్కడ అన్ని దేశాల సైనికులు, నౌకలు స్వేచ్ఛగా సంచరిస్తాయి. దీనిపై భారత్ అప్రమత్తంగా ఉండా ల్సిందే. 1971 ఇండియా-పాక్ వార్.. బంగ్లాదేశ్  విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత పాక్‌కు చెందిన పీఎన్‌ఎస్ ఘాజీని పేల్చేసి నౌకాదళ సామర్థ్యాన్ని చాటింది. అటు తరువాత ఈ ప్రాంతంలో అడుగుపెట్టే సాహసం పాక్ చేయలేదు. 

ప్రస్తుతం చైనా అండతో హంగోర్ శ్రేణి జలంతర్గాములను మోహరింపు దిశగా తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో ఉన్న పాత శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఆ దేశంతో సత్సంబంధాలు నెలుపుతోంది. హంగోర్ జలాంతర్గామి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో రూపొందించారు. దీంతో ఈ జలాంతర్గామిని గుర్తించి, ట్రాక్ చేయడం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సముద్ర జలాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.