పాలేరు నా సొంత ఇల్లు
నేను మీ కుటుంబంలో పెద్ద కొడుకుని..
గ్రామస్థులతో మంత్రి పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పాలేరు, మే 31: పాలేరు తన సొంత ఇల్లు అని, ఇంటి పెద్దబిడ్డలా గ్రామస్థుల సమస్యలు పరిష్కరిస్తానని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామ ల్లో మంత్రి పర్యటించారు. ఆయా గ్రామాల్లో సమస్యల మీద గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంటే ఎన్నికలప్పుడు వచ్చే వ్యక్తి కాదని అన్నారు. సొంత బిడ్డలా భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు.






