16 June, 2026 | 3:31 AM

ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు

16-06-2026 02:16 AM

చిట్యాల, జూన్ 15: ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఉరుమడ్ల గ్రామపంచాయతీకి ఫ్యానును బహూకరించడంతో పాటు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా రవీందర్ రెడ్డి, పోలగొని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.