నూతన విద్యాసంవత్సరానికి ఘనస్వాగతం
నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన బండారు లక్ష్మారెడ్డి
కుషాయిగూడ జూన్ 15 (విజయక్రాంతి) : కుషాయిగూడ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మె ల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రీడలు, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని విద్యార్థుల కు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, బి ఆర్‌ఎస్ సీనియర్ నాయ కులు నేమూరి మహేష్ గౌడ్ బుచ్చన్న గారి శ్రీకాంత్ రెడ్డి గంప కృష్ణ సారా అనిల్ వినోద్ ఆలేటి మైపాల్ రెడ్డిఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చర్లపల్లి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు : ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, జూన్ 15 (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయించడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేయించినట్లు తెలిపారు.
పనులు త్వరగా ప్రారంభమై సజావుగా సాగేందుకు ఘట్కేసర్ పరిధిలోని రాంపల్లి ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో, ముఖ్యంగా డీసీ వాణితో చర్చించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చర్లపల్లి డివిజన్ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని సూచించారు.
ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే తమ లక్ష్యమని, చర్లపల్లి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తెల్ల శ్రీధర్, మహేష్ గౌడ్తో పాటు కాలనీ ప్రతినిధులు సి.హెచ్. సురేందర్ రెడ్డి, కె. కృష్ణా రెడ్డి, డి. భూమ్ రెడ్డి, సి.హెచ్. వెంకట్రాం రెడ్డి, వి. జీవన్ రెడ్డి, బి. సుదర్శన్, సి.హెచ్. శ్రీనివాస్ రెడ్డి, పి. పవన్ కుమార్ రెడ్డి, కె. సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.






