వేసవి తాపానికి!

30-04-2024 12:05:00 AM

వేసవి కాలంలో తాటి ముంజలు, మామిడి కాయలు, పుచ్చకాయలకు మంచి సీజన్. చల్లదనానికి చాలా మంది తాటి ముంజల కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ కాలంలో మాత్రమే అవి విరివిరిగా దొరుకుతాయి. అందుకే ఈ సీజన్‌లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక తాటి ముంజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.

తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, సి,ఎ, విటమిన్లు, జింకు, పాస్పరస్, పొటాషియం, ధయామిన్, రిబో ప్లేవిన్, నియాసిన్ వంటి బీ కాంప్లెక్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే వేసవిలో కొబ్బరి బొండంతో పాటు తాటి ముంజలను ఎక్కువగా తింటుంటారు. ఇవి మృదువుగా తియ్యగా ఉండటం వల్ల పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు.

తాటి ముంజలను తినడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్ లో అవుతుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా దరిచేరవు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డైట్ చేస్తున్నావారు వీటిని రోజూ తీసుకోవడం మంచిది. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ సీజన్‌లో వీటిని తినడం అసలు మిస్ అవ్వకండి.