డార్క్ సర్కిల్స్ పోవాలంటే?

30-04-2024 12:05:00 AM

నైట్ షిఫ్టులు, లిమిట్స్ దాటుతున్న స్క్రీన్ టైమ్స్ కళ్లకింద నల్లటి గీతలని పెంచుతున్నాయి. మేకప్‌తో కవర్ చేసి ఉంచాలన్నా ప్రతీసారీ అది కుదరదు. ఇక పార్లర్‌కి వెళ్లాలన్నా అందరికీ కుదరకపోవచ్చు. అందుకే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ నలుపుగీతలని తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం: నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి వలయాల పై నిమ్మరసం రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బంగాళాదుంప :  బంగాళదుంపలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. దీని కోసం బంగాళాదుంపను రుబ్బి దాని రసాన్ని తీయాలి. డార్క్ సర్కిల్స్ మీద 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత ముఖాన్ని కడగితే సరిపోతుంది.