14-12-2025 10:28:31 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పంచాయతీ అభ్యర్థి మాసు వెంకటస్వామి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం పోలింగ్ మొదలైన నేపథ్యంలో వెంకటస్వామి ఇంట్లో నుంచి పోలింగ్ స్టేషన్ బయలుదేరాడు. ఈ క్రమంలో వెంకటస్వామి ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్నీ వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం వెంకటస్వామిని మంచిర్యాలకు తరలించారు. ఈ ఘటన తాండూర్ మండలం చర్చనీయాంశంగా మారింది.