14-12-2025 03:12:02 PM
జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.
నారాయణపేట,(విజయక్రాంతి): ఈనెల 17న జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు( third phase of election duties) తప్పక హాజరు కావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈనెల 17న జిల్లాలోని మక్తల్,మాగనూరు, కృష్ణ నర్వ ఊట్కూర్ మండలాలలో జరిగే ఎన్నికల విధులకు విధిగా హాజరు కావాలన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించి హాజరు కాకపోతే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కఠినమైన చర్యలు ఉంటాయని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.