calender_icon.png 14 December, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగారంలో ఓటు వేసిన జిల్లా కలెక్టర్

14-12-2025 09:48:39 AM

నారాయణపేట,(విజయక్రాంతి): రెండో విడత ఎన్నికలు జరిగే నారాయణ పేట మండలంలోని సింగారం గ్రామ పంచాయతీలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 25 వ పోలింగ్ కేంద్రంలో పదో వార్డు బూత్ లో జిల్లా కలెక్టర్(District Collector ) సిక్తా పట్నాయక్ ఆదివారం ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా ఉదయం 8:25 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ నేరుగా బూత్ లోకి వెళ్ళి ఓటు వేశారు.  అనంతరం అక్కడున్న పోలింగ్ సిబ్బందితో మాట్లాడి పోలింగ్ సరళిని పరిశీలించారు.

సింగారం గ్రామ మలుపు దారిలో గల కలెక్టర్ బంగ్లా  సింగారం పరిధిలోని కౌరంపల్లి శివారులో ఉండటంతో కలెక్టర్ ఓటు సింగారం గ్రామంలో నమోదైంది. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం తన ఓటు హక్కును సింగారం పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. రెండో విడతలో దామర గిద్ద,నారాయణ పేట,ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల పోలింగ్ జరుగుతోందని, జిల్లా కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా తాము పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నామని, అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. తాను కూడా ఇక్కడి సింగారం గ్రామంలోని పదో వార్డు పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు.