calender_icon.png 14 December, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

79.2శాతం పోలింగ్

14-12-2025 03:14:06 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో(Bellampalli constituency) రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,37 382 ఓటర్లకు గాను 1,08,808 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 79.2 శాతం పోలయ్యాయి. పోలింగ్ నిర్వహణ కోసం బెల్లంపల్లి నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో 996 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 గంటల కు పోలింగ్ మొదలైంది. 7 నుంచి 9 గంటలకు 21.52, 9 నుంచి 11 గంటల వరకు 56.44, 11నుంచి  పోలింగ్ ముగిసే వరకు 79.2 శాతం పోలింగ్ నమోదయింది. బెల్లంపల్లి మండలంలో 74.58, భీమినీలో 89.9, కన్నెపల్లి 81.86, కాసిపేట 77.72, నేన్నెల 87.31, తాండూర్ 86.6, వేమనపల్లి లో 87.2.శాతం నమోదైంది. ఎన్నికలను పురస్కరించుకొని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ వేమనపల్లి, నెన్నెల మండలాల్లో లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కుమార్ దీపక్ నియోజవర్గంలో ను పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ సరళి తెలుసుకున్నారు.

కౌంటింగ్..ఫలితాలపై ఉత్కంఠ..

ఉదయం ఏడు గంటలకు మొదలైన మధ్యాహ్నం ఒంటిగంట వరకు ముగిసింది. అనంతరం పోలింగ్ కేంద్రాల లోనే కౌంటింగ్ ప్రక్రియను రెండు గంటలకు చేపట్టారు. బెల్లంపల్లి నియోజకవర్గం లోని 996 పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు పై ఉత్కంఠత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులు 334, వార్డు సభ్యులు 2001 మంది పోటీలోఉన్నారు. అభ్యర్థుల అదృష్టం బ్యాలెట్ బాక్సులలో ఉంది. సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. గెలుపోటములపై టెన్షన్ నెలకొంది. కొద్ది క్షణాల్లో అభ్యర్థుల జాతకాలు వెలువడనున్నాయి. ఫలితాల పై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తుండటంతో అందరి దృష్టి వారిపైనే ఉన్నది. గెలుపు దీమాలో ఉన్న అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవాల కోసం నిరీక్షిస్తున్నారు.