6 June, 2026 | 6:16 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

తై బజార్ వసూళ్లలో పంచాయతీ సిబ్బంది చేతివాటం

05-11-2025 12:42 AM

దుంపలకుంట మార్కెట్లో ఇష్టారాజ్యం

కొల్చారం, నవంబర్ 4 :కొల్చారం మండలంలోని దుంపలకుంట మార్కెట్లో గ్రామ పం చాయతీ మల్టీపర్పస్ వర్కర్లు తై బజార్ వసూళ్లలో చేతి వాటం ప్రదర్శిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని దుంపలకుంట చౌరస్తాలో ప్రతి మంగళవారం వారాంతపు సంత జరుగుతుంది. ఈ సంతకు సంబంధించి గత మార్చి నెలలో తై బజార్ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన జోగయ్య 1,20,000 కు తైబజార్ ను దక్కించుకున్నాడు.

కాగా ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి రూ.60 వేల రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ గత రెండు వారాల క్రితం ఒక గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ తన సొంత ప్రయోజనాల కోసం పంచాయతీ కార్యదర్శితో కుమ్మక్కై తై బజార్ కాంట్రాక్టర్ జోగయ్యను తొలగించి పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లతో రెండు వారాలుగా తైబజార్ వసూలు చేస్తున్నారు. దీంతో సదరు మల్టీపర్పస్ వర్కర్ తన తోటి సిబ్బందితో కలిసి తై బజార్ వసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దుకాణదారుల నుండి సదరు వర్కర్ అందినకాడికి డబ్బులు వసూలు చేస్తూ రసీదులు ఇవ్వకుండా తన జేబు నింపుకుంటున్నారు. తై బజార్ వసూళ్లను పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి సిబ్బందికి రసీదు బుక్కులను అప్పగించి వెళ్ళింది. దీంతో మల్టీపర్పస్ వర్కర్ల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సౌజన్య వివరణ కోరగా తాను విచారణ జరిపి చర్య తీసుకోనున్నట్లు తెలిపారు.