05-11-2025 12:44:29 AM
పట్టించుకోని మండల వ్యవసాయ అధికారి
కొల్చారం, నవంబర్ 4 :రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో రైతు వేదికలలో అత్యాధునిక సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రతి మం గళవారం ఒక అంశంపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి వ్యవసాయ శాస్త్రవేత్త లు, అధికారు లు వివిధ అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు.
ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తారు. రైతు నేస్తం కార్యక్రమంలో మండల కేంద్రమైన కొల్చారం, పోతంశెట్టిపల్లి, రంగంపేట రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం మూలంగా కొల్చారం, పోతంశెట్టిపల్లి రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనిచేయడం లేదు.
కేవలం రంగంపేట రైతు వేదికలో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనిచేస్తున్నాయి. మంగళవారం రై తు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీ, ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు, పత్తి అమ్మకాలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు.
మండల వ్యవసాయ అధికారి గైర్హాజర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో కొల్చారం, పో తంశెట్టిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ పరికరాలు పనిచేయలేదు. దీంతోపాటు మండల వ్యవసాయ అ ధికారి శ్వేత కుమారి, కొల్చారం ఏ ఈ ఓ లు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
పెద్ద సంఖ్యలో రైతులను ఒక దగ్గరకు చేర్చి రైతులను అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్ళించడం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి వీడియో కాన్ఫరెన్స్ పరిక రాలు ఏర్పాటు చేసినప్పటికీ మండల వ్యవసాయ అధికారి నిర్లక్ష్యం మూలంగా అవి పని చేయడం లేదని,
మండల వ్యవసాయ అధికారి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా డుమ్మా కొట్టడంతో ఆమె తన విధులు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది అని మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకోని తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారుని వివరణ కోరడానికి సంప్రదించగా కార్యాలయంలో, ఫోన్లో కూడా అందుబాటులో లేరు.