31 August, 2026 | 1:34 AM

కాగితం పడవలు గుర్తుండిపోయే ప్రేమకథ

31-08-2026 12:00 AM

వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘కాగితం పడవలు’. ఈ సినిమాకు ఎంజీఆర్ తుకారాం దర్శకుడు. ఎస్‌ఎల్‌ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ పాటను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ.. “కాగితం పడవలు’.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దామనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఇది అందరికీ గుర్తుండిపోయే సినిమా. సెప్టెంబర్ 18న థియేటర్లలో కలుద్దాం” అన్నారు. హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ.. “కాగితం పడవలు’ తెలుగులో నా రెండో సినిమా. ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌లో నటించాను.

సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పింది. ‘మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంద’ని దర్శకుడు తుకారాం తెలిపారు. ‘ఈ సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. తప్పకుండా మీరంతా సపోర్ట్ చేయాలి’ అని నిర్మాత అంజనప్ప అన్నారు. డీవోపీ రుద్ర సాయి మాట్లాడుతూ.. “కాగితం పడవలు’ ఒక ఎమోషన్. కంటెంట్ బాగున్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా చాలా బాగుంటుంది” అని చెప్పారు.