తెల్ల కాగితం వచ్చేది అప్పుడే
‘కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ నుంచి వస్తున్న కొత్త సినిమా ‘తెల్ల కాగితం’. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మలపాటి సమర్పణలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాతో రమేశ్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా, నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, ‘చిలకా’ సాంగ్ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. ‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి విజయవంతమైన చిత్రాలకు సహ-రచయితగా గుర్తింపు పొందిన రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథను అందించారు. స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా ఆయనే రాశారు. ‘బేబీ’ వంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.






