06-12-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి డిసెంబర్ 5 (విజయక్రాంతి): పారా లీగల్ వాలంటీర్లు సమాజానికి , న్యాయ సేవా సంస్థకు వారదులని సమాజంలో అర్హులైన వారికి న్యాయ సేవ సంస్థల ద్వార సేవలు అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి మాధవి లత కోరారు.
డిసెంబర్ 21వ తేదీ రోజున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో న్యాయవాదులు సహకరించి రాజీ పడదగు కేసుల అధిక పరిష్కారానికి కృషి చేయాలని తద్వారా జిల్లాలోని చిన్న తగాదాల కేసుల పెండింగ్ తగ్గి తీవ్ర నేరాల కేసులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని, సంఘంలో శాంతి, స్నేహం వృద్ధి జరిగేలా చూడొచ్చని తెలిపారు. కక్షిదారులు రాజీ పరిష్కారంతో తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని, లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పని తెలిపారు .
ఈ కార్యక్రమములో భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వి వి గౌడ్, ఉపాధ్యాక్షులు రేణుక, కార్యదర్శి బొల్లేపల్లి కుమార్ మరియు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి , సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఆ తదుపరి భువనగిరిలోని సబ్ జైలును సందర్శించి , అర్హులైన కక్షిదారులకు న్యాయ సహాయం అందుతుంది లేనిది సమీక్షించి, న్యాయ సహాయానికి తగు చర్యలు తీసుకోవటానికి న్యాయ సహాయ న్యాయవాదులకు సూచనలు చేసారు.