calender_icon.png 6 December, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల్ పూర్ తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

05-12-2025 11:18:42 PM

వరుసగా రెండు పర్యాయాలు ఏకగ్రీవం

చారకొండ: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని కమాల్ పూర్ తండా గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు వరకు కమాల్ పూర్ తండా పరిధిలోని నూకలచింత వాడిక తండాకు చెందిన కేతావత్ రవి కుమార్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018 లో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో ఏర్పాటు అయిన కమాల్ పూర్ తండా 2019లో జరిగిన మొదటి ఎన్నికల్లో గ్రామస్తులు అంతా ఒకే మాటపై ఉండి అలివేలును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడ పార్టీలకతీతంగా గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి కేతావత్ రవికుమార్ ను, 8 వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా రెండవ సారి కూడ సర్పంచి, వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామపంచాయతీ వాసులందరు విజయోత్సవ సంబరాలు జరుపూకున్నారు.