calender_icon.png 7 December, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది

06-12-2025 12:00:00 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): పాఠశాల దశలో క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని నిజామాబాద్ జిల్లాలో క్రీడా సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఎంవి సుబ్బారావు స్మారకంగా నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ అంతర్ పాఠశాల క్రీడోత్సవాల మహోత్సవ ముగింపు సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  ధన్పాల్ సూర్యనారాయణ విజేతలైన క్రీడాకారులకు పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే గారు మాట్లాడుతూ  చిన్నారుల్లోని ప్రతిభ దేశ భవిష్యత్తుకు పునాదులు  అని తెలిపారు.. గతంలో కలెక్టరేట్ గ్రౌండ్ ని కమర్షియల్ టైపులో మార్చాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు వాటిని అడ్డుకొని ఈరోజు  మైదానాన్ని   ఇలా ఉంచడంలో తన నా కృషి ఎంతో వుందన్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మన  నిజామాబాద్ జిల్లాకు ఒక స్టేడియం  కచ్చితంగా కావాలి అని అసెంబ్లీలో గలం వినిపిస్తాను అని తెలిపారు.. భవిష్యత్తులో అసోసియేషన్ వాళ్లు ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించిన వారికి నా ట్రస్ట్ తరఫున తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మీసాల ప్రశాంత్, ట్రెజరర్ గంగ మురళి, బీజేపీ నాయకులు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.