2 March, 2026 | 5:00 AM

సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి

02-03-2026 01:26 AM

చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి

రాజేంద్రనగర్, మార్చి 1 (విజయక్రాంతి) : సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలునిచ్చారు. బండ్లగూడ జాగీర్ డివిజన్ పరిధిలోని  కాళీ మందిర్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిస్మత్ పూర్ మాజీ ఉప సర్పంచ్ నిరుడు శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో యోగక్షేమం వహామ్యహం చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్సీహెచ్ సాదురాం  కంటి ఆసుపత్రి  సహకారంతో బండ్లగూడ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆదివారం వైద్యశిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మహాలింగం, భీమార్జున్‌రెడ్డి, మాజీ సింగింగ్ విండో చైర్మన్ రాందాసు ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు మహేష్‌యాదవ్, ఉపాధ్యక్షులు నరేష్‌యా దవ్, ప్రధానకార్యదర్శి పవన్‌సాయి, ప్రవీణ్ గౌడ్, అభినయ్‌గౌడ్, టీ నర్సింగ్ రావుగౌడ్, టీ గోపిగౌడ్, వై సాయికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు