ప్రజలు సాంస్కృతిక విలువలు రక్షించుకోవాలి
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మార్చి 1 (విజయక్రాంతి): దేవాలయాలు సమాజంలో శాంతి కేంద్రాలుగా నిలవాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని షేక్‌పేట డివిజనులో ఉన్న హనుమాన్ దేవాలయంలో నూతనంగా శ్రీ నాగదేవత విగ్రహాలు, శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యే పూజలు, హోమాలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కోసం నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఆధ్యాత్మికత చింతనను పెంపొందించుకోవడంతో పాటు ప్రజలు సాంస్కృతిక విలువ లను పరిరక్షించుకోవాలని అభిప్రాయపడ్డా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఉన్నారు.




