టీఆర్పీలో భారీగా చేరికలు
హైదరాబాద్/వరంగల్, మార్చి1(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు పనగట్ల చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో కుషాయిగూడ డివిజన్ నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నాయకులు టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, పార్టీ మేడ్చల్ జిల్లా యువత అధ్యక్షులు సింగం అరుణ్ పటేల్, మేడ్చల్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అభిరామ్, జిల్లా పార్టీ జాయిం ట్ సెక్రటరీ కమలాకర్, జిల్లా కార్యదర్శి రాంగిరివార్ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బడంగ్‌పేట్ డివిజన్ నుంచి..
రంగారెడ్డి జిల్లా బడంగపేట్ డివిజన్ ప్రెసిడెంట్ సీఏ అలగాని పవన్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు టీఆర్పీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం కో సం జరుగుతున్న పోరాటాలు, అలాగే పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోరాట పటిమ తమను ఆకట్టుకుందని యువకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యువకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారు మనోజ్, ఉదయ్, భాను, జ్ఞానేశ్వర్, సాయి, శివరాచారి, నారాయణచారి, మహేష్, వినో ద్, ఆనంద్, స్వామి ఉన్నారు. అనంతరం యువతను ఉద్దేశించి మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో సమాన హక్కులు, సామాజిక న్యాయం, బీసీఎస్సీఎస్టీమైనారిటీల సాధికారత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజీపేట చౌరస్తాలో..
ట్రై సిటీస్ ప్రాంతంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)కి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఆదివారం కాజీపేట చౌరస్తాలో పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున్ శాస్త్రి ఆధ్వర్యంలో ఆరు డివిజన్లకు చెందిన సుమారు 100 మంది మహిళలు, మరో 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను వీడి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ హాజరై కొత్త గా చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యలను స్వయంగా ముందుండి పరిష్కరించే నాయకుడని, ప్రతి వర్గానికీ న్యాయం చేసే ధైర్యవంతుడని తెలిపారు. రానున్న రోజు ల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్పీని బలోపేతం చేస్తామని పార్టీలో చేరినవారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్త శ్రీనివాస్,పోలు రాజు,భద్రకాళి చారి, గ్రేటర్ వరంగల్ కార్యదర్శి మురారి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి ఉదయ్ కుమార్, నాగవల్లి రమేష్, పట్టుపల్లి వెంకట్, మహిళ నాయకురాలు వాణి రమ్య తదితర మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు.




