calender_icon.png 26 July, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలి

26-07-2025 08:14:25 AM

జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి 

మండలంలో పలు ఎరువుల దుకాణాలు తనిఖీ

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతులకు ఎరువులు,విత్తనాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి జి శ్రీధర్ రెడ్డి(District Agriculture Officer Sridhar Reddy) అన్నారు. శుక్రవారం జాజిరెడ్డిగూడెం,మండల కేంద్రం అర్వపల్లిలోని ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి తూకం యంత్రాలు,రసీదు పుస్తకాలను పరిశీలించి స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని డీలర్లకు సూచించారు.అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందొద్దని అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని అన్నారు.యూరియా ఎక్కువ వాడడం వల్ల భూసారం తగ్గి వాతావరణ కాలుష్యం పెరుగుతుందని,పంట కూడా పురుగుల బారిన పడే ఆస్కారం ఉందన్నారు.యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులు ద్రవ రూపంలో లభించే నానో యూరియాను వాడుకున్నట్లయితే ఎరువుల ఖర్చు తగ్గుతుందని సూచించారు.తదనంతరం మండల కేంద్రం అర్వపల్లిలో రైతులు సాగుచేస్తున్న జీలుగ పంటను సందర్శించి జీలుగ పంట వల్ల భూసారం పెరగడమే కాక రసాయన ఎరువుల వాడకం తగ్గించుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులకు సూచించారు.కార్యక్రమంలో ఏఓ పి గణేష్,డీలర్లు ఖమ్మంపాటి నరేష్,నల్ల రామచంద్రయ్య,వీరసోములు,లోడంగి నాగరాజు తదితరులు ఉన్నారు.