calender_icon.png 26 July, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సమస్యే దేశ సమస్య

26-07-2025 01:29:49 AM

బీసీ కులాలు అంటే చిన్నచూపు 

పాలించేవన్నీ బీసీ వ్యతిరేక ప్రభుత్వాలే

  1. నిర్లక్ష్యంగా ఉంటే బీసీ రిజర్వేషన్ హుళక్కే 
  2. ఏపీలో తెలంగాణ బీసీ ఉద్యమ ప్రభావం
  3. రిజర్వేషన్‌తోనే ఆర్థిక అంతరాల తగ్గుదల
  4. బీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు
  5. తెలంగాణలో ఉన్న చైతన్యం ఏపీలో లేదు
  6. ఆలిండియా బీఎస్పీ జాతీయ కో మాజీ డీజీపీ పూర్ణచందర్‌రావు

హైదరాబాద్, జూలై 25 (విజయ క్రాంతి ): ‘దేశంలో, ఏ రాష్ట్రంలోనూ బీసీ ఉద్యమం తప్పితే మరే ఉద్యమమూ లేదు. కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి, ఇంకా ఎవరైనా 2029 ఎన్నికల వరకు బీసీల రిజర్వేషన్లను అన్ని రకాలుగా అమలు చేయాలి. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న పాలకులందరూ ఓటమి పాలవుతారు’ అని ఆలిండియా బీఎస్పీ జాతీయ కో మాజీ డీజీపీ పూర్ణచందర్‌రావు హె చ్చరిస్తున్నారు.

పూర్ణచందర్‌రావు వృత్తిపరం గా పోలీస్ శాఖలోని అనేక హోదాలను బా ధ్యతాయుతంగా, సమర్థవంతంగా నిర్వర్తించారు. పదవీ విరమణ అనంతరం బీసీల హ క్కుల సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తున్నా రు. రాజకీయంగా బీసీలకు సరైన ప్రాధాన్యత లభించినప్పుడే వారు ఆర్థికంగా, సా మాజికంగా ఎదుగుతారని చైతన్యం చేస్తున్నా రు. ఆయనతో ‘విజయక్రాంతి’ ముఖాముఖి ఇది. ‘బీసీలతో ఏం జరుగుతుంది.

వారు ఏం చేయగలరని అనుకుంటే చాలా నష్టపోతారు. బీసీలది న్యాయమైన సమస్య, దాన్ని పరిష్కరించాల్సిందే. డీజీపీగా పనిచేసిన నే ను కూడా కులం గురించి, కులం పరంగా జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేటంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బీసీల రిజర్వేషన్లపై ప్ర తిఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది.

బీసీల ఉద్యమం ప్రారంభమైంది. అది తీవ్ర రూపం దాల్చకముందే బీసీల సమస్యను పరిష్కరించాలి’ అని పూర్ణచందర్‌రావు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలు, తెలంగాణలో పోలిస్తే ఏపీలో నెలకొన్న భిన్న రాజకీయాలపై ఆయన పం చుకున్న మరిన్ని విషయాలు.

బీజేపీ తీరును ప్రజల దృష్టికి తీసుకురావాలి.. 

బీసీలకు నమ్మకం కలగాలంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ ఇదే తర హా ధోరణిని కొనసాగించా లి. రాహుల్‌గాంధీ సహా రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. నా మమాత్రంగా చేసి చేతులు దులుపుకోకూడదు. రిజర్వేషన్లపై బీజేపీ అవలంబిస్తున్న తీరును ప్రజల దృష్టికి తీసుకురావాలి.

బీసీల సమస్యే భారతదేశ సమస్య. ఇకపై తాత్సారం చేయడానికి ఆస్కారం లేదు. విద్య, ఉపాధి, రాజకీయంగానే కాదు, ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ప్రమో షన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. కమ్మ, రెడ్లకు జనాభాకు తగ్గట్టుగా అవకాశాలిస్తే సరిపోతుంది. విద్యాపరంగా అగ్రకులాలకు రిజర్వేషన్ ఎందుకు? 

వారి కుటుంబాలకే టిక్కెట్లన్నీ.. 

ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు బీసీలకు రిజర్వే షన్లు ఇవ్వాలి. బీసీలు తమ హక్కులను కాపాడుకోవాలంటే చట్ట సభల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీలకు చట్ట సభల్లో సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు మాకు అనుకూలమైన నిర్ణయాలు ఎలా జరుగుతాయి. బీసీలకు టిక్కెట్లు దక్కినా ఆర్థికంగా బలంగా ఉన్నవారికే అవి లభిస్తున్నాయి. ఆం ధ్రప్రదేశ్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎనమల రామకృష్ణుడి వంటి నాయకుడి కుటుంబంలోనే నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు ఉన్నాయి.

మరి ఆ సామాజికవర్గం లో మిగిలిన వారి పరిస్థితేంటి. చంద్రబాబుకు, ఆయన కుమారుడికి, ఆయన బావ మరిది బాలకృష్ణకు, లోకేశ్ తోడుల్లుడికి, చంద్రబాబు వదినకు.. ఇలా ఐదు టిక్కెట్లు వారి దగ్గరే ఉన్నాయి. కేసీఆర్‌కు, కేసీఆర్ కు మారుడు కేటీఆర్, కూతురు కవితకు, మేనల్లుడు హరీశ్‌కు, సంతోష్‌కుమార్‌కే టిక్కెట్ ఇస్తే బీసీలు రాజకీయంగా ఎదగకూడదా? 

పొటిలికల్ డెమోక్రసీ కావాలి.. 

విద్యలో, ఉద్యోగాల్లో వెనుకబడితే రిజర్వేషన్ ఇచ్చినప్పుడు రాజకీయంగా వెనుకబ డితే ఎందుకు రిజర్వేషన్ ఇవ్వరు. పొటిలికల్ డెమోక్రసీ లేకుండా ఎకనామికల్, సోషల్ డెమోక్రసీ రాదు. చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినపుడే రాజకీయ సమానత్వం సాధ్యమవుతుంది. అంబేద్కర్ పోరాడకుంటే దేశంలో ఇప్పటికీ అంటరానితనం ఉండేది.

తమిళనాడు నుంచి ఏపీ విడిపోకపోతే వారి లాగానే ఏపీలోనూ రిజర్వేషన్ అమలయ్యేవి. మహా రాష్ట్రలో సామాజిక పోరాటాల ప్రభావం తెలంగాణ, హైదరాబాద్‌పై ఉండేది. అప్పు డు తమిళనాడు తరహాలో ప్రభుత్వాలు ఇక్కడ సాధ్యమయ్యేవి. అయితే ఈ రకమైన మార్పు రాకుండా గ్రామాల్లో పెత్తనం చేసేవారు రాష్ట్ర స్థాయిలో నూ పెత్తనం చేస్తున్నారు. 

ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు..

విద్య, ఉద్యోగం, రాజకీయ, ప్రమోషన్లలో రిజర్వేషన్లతోపాటు ప్రైవేట్ రంగంలోనూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణ జరుగుతుంది. మెరిట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కమ్మ, రెడ్డి, వెలమ కులాల వారికి లేదు. తెలంగాణ బీసీల్లో ఉన్న చైతన్యం ఆంధ్రప్రదేశ్ బీసీల్లో లేదు. ఏపీలోని బీసీల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు ఆలిండియా బీఎ స్పీ తరఫున కృషి చేస్తున్నాం. తెలంగాణలోని పరిణామాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. చంద్రబాబునాయుడు బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేసే దిశగా పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏపీలోనూ తీవ్రంగా ఉంటుంది. హామీ ఇచ్చినంత సులువుగా అమలు చేయడం లేదు. చంద్రబాబు తలచుకుంటే ఎన్డీయే ప్రభుత్వాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ అమలు చేయించగలరు. కానీ ఆ విధంగా చేయడం లేదు. 

ఏపీలోనే కులవివక్ష ఎక్కువ.. 

తెలంగాణలో కంటే ఏపీలో కులవివక్ష ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏపీ లాంటి రాష్ట్రాల్లోనే బీసీ రిజర్వేషన్ అవసరం ఎక్కువగా ఉంది. కులాల ప్రాతిపదికన అణచివేత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏపీలోని బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. సమైక్య ఆంధ్ర ఉద్యమం కారణంగా ఏపీలోని బీసీలు వారి హక్కులను సాధించు కో వడాన్ని మరిచిపోయారు.

బీసీలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రస్తుత పాలకులందరూ గుర్తించాలి. మోదీ అయినా, చం ద్రబాబు అయినా పరిష్కరించాలనుకుంటే ఎందుకు సాధ్యం కాదు. కనీసం వచ్చే ఎన్నికల్లో గెలువడానికైనా బీసీ రిజర్వేషన్ అమ లు చేయా లి. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వర్గాలు వారి హక్కులను సాకారం చేసుకోవాలన్న చట్ట సభల్లో బీసీల సహకారం ఎంతో అవసరం. ప్రైవేట్ పరంగా కూడా రిజర్వేషన్లు ఇస్తేనే బీసీలకు అన్ని ఫలాలు అందుతాయి.

పాలకుల నిర్లక్ష్యంతోనే బీసీలకు అన్యాయం.. 

ప్రస్తుతం బీసీలకు రిజర్వేషన్లు చాలా అవసరం. ఎందుకుంటే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దేశంలో బీసీలు ఇంకా వెనుబడే ఉన్నారు. పాలకుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. గతంలో దామోదరం సంజీవయ్య బీసీలకు రిజర్వేషన్ లిస్టు తయా రు చేస్తే తర్వాత వచ్చిన నీలం సంజీవరెడ్డి సీఎం పదవిని వదిలేస్తూ రిజర్వేషన్ల లిస్టును రద్దు చేశారు. బీసీ వ్యతిరేక ప్రభుత్వాలే ఇప్పటి వరకు పాలించాయి.

మద్రాసులో 1927లోనే బ్రాహ్మణేతర రిజర్వేషన్లు ఉన్నా యి. దీంతో స్వాతంత్య్రం వచ్చే వరకు బీసీలు రిజర్వేషన్లు అనుభవించారు. కానీ చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే అప్పుడు నెహ్రూ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంది. 1973లోనూ తెలంగాణ ఉద్యమ ప్రభావంతోనే బీసీలను పట్టించుకున్నారు. అప్పుడు అడ్డుకున్నవారే ఇప్పుడు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా వేరే దారి లేదు. ఏదేమైనా వారి నిర్ణయంతో బీసీలకు మంచే జరుగుతుంది.

అయినప్పటికీ బీసీలు భ్రమలో ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే బీసీ రిజర్వేషన్ హులక్కే అవుతుంది. కాంగ్రెస్, బీజేపీ బీసీ సమస్యను ఫుట్‌బాల్ లాగా ఆడుకుంటున్నాయి. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మేమే ఇవ్వాలి. గానీ కాంగ్రెస్ ఇవ్వడమేంటనీ బీజేపీ భావిస్తుంది. అయినా బీజేపీని నమ్మడానికి లేదు. 2029 ఎన్నికల్లో కులగణన చేయకుండా, చేసినా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండే ప్రమాదమూ ఉంది. ఇప్పటివరకు అందరూ బీసీలను మోసం చేస్తూనే వస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమమే ఊతం.. 

తెలంగాణ ఉద్యమంలో చైతన్యం ఉన్న బీసీ నాయకులంతా అధికంగా పాలుపంచుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు ఏం న్యాయం జరిగింది. 60 శాతం ఉన్న బీసీల నుంచి అసెంబ్లీలో 70కి పైగా ఎమ్మెల్యేలు ఉండాల్సింది. 19 మంది మాత్రమే ఉన్నారు. ఇన్నేళ్లలో బీసీ నాయకులు ప్రజలకు తెలిశారు. కానీ ప్రజా ప్రతినిధులుగా గెలువలేదు. అందులోనూ కొంతమందే బీసీలకు దక్కాల్సిన ఫలాలను అందిపుచ్చుకున్నారు.

బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకులు వారి వ్యక్తిగత స్వార్థమే చూసుకున్నారు. కమ్యూనిటీని ఎదగనివ్వలేదు. మున్నూరు నాయకులు మున్నూరు కాపులను, యాదవ నాయకులు యాదవులకు, గౌడ నాయకులు గౌడ కులస్తులకు అన్యాయం చేస్తున్నారు. అంతే కాకుండా ఇతర బీసీ కులాలను చిన్నచూపు చూస్తున్నారు. ఏపీలో ఇప్పటివరకు దాదాపు 120 కులాలకు చెందినవారు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే పొందలేదు. 

కేసీఆర్, చంద్రబాబు బీసీలను మోసం చేశారు.. 

కేసీఆర్ సీఎంగా ఉన్నతకాలం రె డ్డిలు ఆయన్ను కుర్చీ దించాలనుకున్నా రు. చివరకు దించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయినా కేసీఆర్‌ను రెడ్డిలు గ ద్దె దించారు. మరి ఎంతో తెలివైన నా యకుడైన కేసీఆర్ బీసీలను ఎందుకు చేరదీయలేదు. ఇప్పుడు బీసీలు ఆయ న వెంటే ఉండేవారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు. 1983 నుంచి ఎన్టీఆర్, ఇప్పటికీ చంద్రబాబు బీసీలకు అ న్యాయమే చేస్తున్నారు. అందుకే టీడీపీ చరిత్రలో నాలుగుసార్లు గెలిస్తే, నాలుగుసార్లు ఓడిపోయారు.

బీసీలను విస్మ రించి గెలువడానికి ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. డబ్బు ఆశచూపి ఎన్నికల్లో గెలుస్తున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలో చెరో నాలుగైదు వేలకోట్లు ఎన్నికలకు ఖర్చు చేశారు. ఏదో రకంగా గెలుస్తున్నారు. కానీ బీసీలకు మాత్రం న్యాయం చేయటం లేదు. ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు అంద రూ బీసీలను మోసం చేశారు. బీసీలకు రాజకీయంగా న్యాయం చేస్తే ఎవరికీ ఓడిపోయే కర్మ పట్టదు.