బీఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్లు
అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు
చండ్రుగొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీకి గ్రామాల్లో కార్యకర్తలే పునాదని అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు స్పష్టం చేశాడు. బుధవారం చండ్రుగొండ మండలం మద్దుకూరు, రావికంపాడు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన బిఆర్‌ఎస్ పార్టీ దిమ్మెలను ప్రారంభించి, జెండాలను ఆయన ఆవిష్కరించారు.
మద్దుకూరులో గ్రామశాఖ పార్టీ కార్యలయ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశాడు. రావికంపాడులో బిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ప్రదర్సన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మేల్యే మాట్లాడుతూ.... గ్రామాల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పట్టుదలతో ఉన్నారని, వారందరి ఆశ, కోరిక రాబోయే రోజుల్లో నెరవేరనుందన్నారు.
అధికార పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలు ఇచ్చి, మోసపు వాగ్దానాలు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చరన్నారు. అనంతరం అయ్యన్నపాలెం గ్రామంలో అకాలమరణం పొందిన ఆటోడ్రైవర్ నాగుల్మీరా కుటుంబాన్ని పరామర్సించి, ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. ఆయన వెంట గుంపెన సోసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, గానుగపాడు సోసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






