30-04-2025 07:37:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో పదో తరగతి ఫలితాలు 98.01% ఉత్తీర్ణత సాధించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఐటీడీఏ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ నాయక్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 17 ఆశ్రమ పాఠశాల ఉండగా ఈ విద్యా సంవత్సరం 421 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పదవ తరగతి ఫలితాలు సమిష్టి కృషితోనే సాధ్యమైందని ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం 100% ఫలితాలు సాధించే విధంగా ఇప్పటినుండి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.