calender_icon.png 6 July, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయిజి శీలం లక్ష్మణ్ వర్ధంతి

06-07-2025 01:17:24 AM

మున్నూరుకాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): స్వతంత్ర సమరయోధుడు, పాండిచ్చేరి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్, మహారాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్ సాయిజి శీలం లక్ష్మణ్ 40వ వర్ధంతిని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మున్నూరు కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీ హనుమంతరావు హాజరై లక్ష్మణ్ జీవిత చరిత్రను తెలియజేసే బ్రోచర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపు చరిత్రను, ప్రముఖుల జీవిత చరిత్రను వెలుగులోకి తెస్తున్న మున్నూరుకాపు విద్యావం తుల వేదికను అభినందించారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సమాజానికి ఎంతో ముఖ్యమైన సమాచారం అందించాల్సిన బాధ్యత కూడా వేదిక మీదే ఉన్నదని చెప్పారు. మున్నూరుకాపు మహనీయులకు చెందిన చరిత్రను పుస్తక రూపంలో అందించాలని, దానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో మున్నూరు కాపు బాలికలకు సంబంధించిన హాస్టళ్లలో కూడా తన సొంత నిధుల ద్వారా నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

రుద్ర సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. మహనీయులను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని, కాపు సమాజం భవిష్యత్తులో స్వతంత్ర శక్తిగా ఎదిగి బహుజన రాజ్య స్థాపనలో భాగం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు అనంతుల శ్యామ్మోహన్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు సాసాల మల్లికార్జున్, నీలం సంపత్‌కుమార్, ఎడ్ల రవికుమార్, పర్వతం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్, తిరుపతి, బండి సంజీవ్, పుట్టం పురుషోత్తం, పెద్ద పెంటయ్య, బండి పద్మ, ఎంఎన్ రావు తదితరులు పాల్గొన్నారు.