23 June, 2026 | 11:56 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నిద్రపోతున్న నిఘా నేత్రాలు

06-02-2026 01:35 AM
  1. తరిగొప్పుల మండలంలో అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు

మరమ్మతు చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం

తరిగొప్పుల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారా యి. నేరాలు, దొంగతనాల నివారణకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. అవి మరమ్మతుకు రాగా.. కనీసం అధికారులు రిపేర్లు కూ డా చేయించడం లేదు. దీంతో దొంగతనాలకు ఊతం ఇచ్చినట్లు అవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

తరిగొప్పుల మండడలంలో అన్ని గ్రామాల్లో కలిపి కొన్ని నెలల క్రితం దాదాపు 150 సీసీ కెమెరాలు ఏర్పా టు చేశారు. ఇందులో చాలా వరకు దాతల సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపం కారణంగా 90 శాతం సీసీ కెమెరాలు పనిచేయ డం లేదు. మండలకేంద్రంలోని ప్రధాన ఏరియాలతో పాటు, ప్రతీ గ్రామంలో రెండు మూడు నిఘా నేత్రాలు బిగించారు. సీసీ కె మెరాల నిఘా ఉండడంతో చాలా వరకు నే రాలు తగ్గాయి.

వీటి సాయంతో పోలీసులు చోరీలను కూడా నియంత్రించారు. కానీ ఇటీవల నిఘా నేత్రాలు మరమ్మతుకు వచ్చి అ లంకారప్రాయంగా మారడంతో దొంగతనా లు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానని పోలీసు అధికారులే చెప్తుంటారు. చోరీ నిందితులను సులువుగా పట్టుకునేందుకు కెమెరాలు దోహదపడుతా యి.

కానీ అవి పనిచేయకపోవడంతో ఇదే అ దనుగా దొంగలు చోరీలకు పాల్పడే అవకా శం ఉందని, ఇప్పటికైనా సీసీ కెమెరాలను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు సీసీ కెమెరాల సంఖ్య కూడా పెం చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

చోరీలకు ఆస్కారం 

సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల పలు చోరీలు బయటికి వచ్చే అవకాశం లే దు. ఎక్కడైనా ఇంట్లో చోరీ జరిగి ఫిర్యాదు చే స్తే తప్ప వెలుగులోకి రావు. ఒకవేళ రాత్రివేళ దొంగలు సంచరిస్తే ఆ విషయాన్ని ముందే పసిగట్టే అవకాశం లేకపోవడంతో అకస్మాత్తుగా చోరీలు జరిగే ప్రమాదం ఉంది. గ్రా మాల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే నిందితుల కదలికలను, అనుమాన వ్యక్తులను గుర్తించే అవకాశం ఉండేది.

కానీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల నిందుతులను దొరకబ ట్టడం పోలీసులకు కష్టతరంగా మారుతోం ది. పలుమార్లు వార్తలు రాసిన కూడా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.