పేషెంట్ కేర్‌టేకర్ ఆత్మహత్యాయత్నం సూపర్‌వైజర్ వేధింపులే కారణం?
ఆదిలాబాద్, మే 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో పేషెంట్ కేర్‌టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న గణపతి లక్ష్మిఅనే మహిళ బుధవారం విధుల్లో ఉన్న సమయంలోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన మిగతా పేషెంట్ కేర్‌టేకర్లు ఆమెను చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆమె రిమ్స్‌లోనే చికిత్స పొందుతోంది. చీఫ్ సూపర్‌వైజర్ రవి కొన్నిరోజులుగా పలువురు కేర్‌టేకర్లను మానసికంగా వేధిస్తున్నార ని, వేధింపులు భరించలేక తాను ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితురాలు లక్ష్మి తెలిపారు.
ప్రస్తుతం ఆమె ప్రాణా నికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు రిమ్స్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. సూపర్‌వైజర్‌పై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. వేధింపుల విషయాన్ని రిమ్స్ డైరెక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదని మిగతా కేర్‌టేకర్లు వాపోయారు.




