సాగుకు సిద్ధమవుతున్న దుక్కులు
ఆసిఫాబాద్ జిల్లాలో వానకాలం ప్రణాళిక
4.61 లక్షల ఎకరాల్లో పంటల అంచనా
అత్యధికంగా 3.5 లక్షల ఎకరాల్లో పత్తి
59 వేల ఎకరాల్లో వరి వేసే అవకాశం
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
సరిపడా విత్తనాలు, ఎరువుల కోసం వ్యవసాయశాఖ అధికారుల ప్రతిపాదనలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 15 (విజయక్రాంతి): వానకాలం పంటల సాగుకు రైతన్న లు సిద్ధమవుతున్నారు. సాగుకు అనుగుణంగా దుక్కులను దున్ని ఏర్పాట్లు చేసు కుంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా అన్నదాతలు ఇప్పటికే దాదాపు 70 శాతం భూములను దున్ని సిద్ధంచేసుకున్నారు. వానకాలం పంటల సాగుకు సంబం ధించి వ్యవసాయశాఖ అధికారులు సైతం ప్రణాళికలు సిద్ధంచేశారు. ఇప్పటికే యాసం గి పంటల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. మరోవైపు 20 రోజుల్లో వానకాలం పంటలు వేసేందుకు రైతాంగం సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో వ్యవసా యశాఖ అధికారులు వానకాలం సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను సిద్ధంచేశారు. విత్తనాలు, ఎరువుల కోసం ప్రతిపాదనలు రూపొందించారు. సాగుకు అవసరమైన ఎరువులను దశలవారీగా తెప్పించేందుకు ప్రణాళికను తయారు చేశారు. జిల్లాలో 4,60,196 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 7 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 85.91 టన్నుల ఎరువులు అవసమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
అత్యధికంగా పత్తి సాగు
వానకాలంలో జిల్లావ్యాప్తంగా 4.6 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందులో అత్యధికంగా పత్తి 3.5 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. వరి 59 వేల ఎకరాల్లో సాగువుతుందని అధికారులు చెప్తున్నారు. వీటితోపాటు కంది 38 వేల ఎకరాల్లో, పెసర 1,700 ఎకరాలు, సోయబీన్ 6 వేలు, మక్కజొన్న 742 ఎకరాలు, జొన్న 680 ఎకరాలు, మినుములు 163 ఎకరాలు, వేరుశెనగ 178 ఎకరాలు, మిరప 3 వేల ఎకరాలు, నువ్వులు 10 ఎకరాలు, అముదం 10 ఎకరాల్లో అన్నదాతులు సాగు చేయనున్నట్టు అంచనా వేశారు.




