ఉమ్మడి రాష్ట్రంలో అంజయ్య సీఎంగా చేసిన సేవలు మరువలేనివి
18-10-2025 05:25 PM
హైదరాబాద్ లో అంజయ్య వర్ధంతిలో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు..
మంథని (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో శుక్రవారం రాత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ శ్రీనుబాబు కొనియాడారు. రాజకీయాలలోకి వచ్చే యువకులు అంజయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో అంజయ్య చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.




