14-01-2026 01:28:37 AM
పోలవరం,- నల్లమల న్యాయపోరాటంపై హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి విమర్శలు హాస్యాస్పదం
పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గుండ్లపల్లి సత్యనారాయణ ధ్వజం
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): పోలవరం, -నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయం లో సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయ ప్రక్రియపై బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానాని కి పరాకాష్ట అని పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన మాట్లా డుతూ.. పదేళ్లు అధికారంలో ఉండి ఏపీ అక్ర మ ప్రాజెక్టులకు వంతపాడినవారు, నేడు నీతు లు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. హరీశ్‌రావు పదేళ్లు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను అక్రమంగా నిర్మిస్తుంటే కళ్లు అప్పగించి చూసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.
కోర్టు సూచనల మేరకు కేసును మరింత పటిష్టం చేయ డానికి ‘సివిల్ సూట్ వేస్తుంటే, దాన్ని ‘లొంగుబాటు’ అని ముద్రవేయడం దిగజారుడు రాజ కీయాలకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా ఆర్టికల్ 131 కింద కేసు వేయాలని సూచిస్తే, అది తెలంగాణకు దక్కిన ప్రాథమిక విజయంగా మేము భావిస్తున్నాం. సాంకేతిక కారణాలతో కేసు పక్కకు పోకూడద నే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
అనుమతులు లేకుండా 200 టీఎంసీల నీటిని తరలించే ఏపీ కుట్రలను అభిషేక్ మనుసింఘ్వీ వంటి హేమాహేమీలతో న్యాయస్థానంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. “తెలంగాణ నీటి చుక్కపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏనాడూ రాజీ పడదు. తెలంగాణ హక్కులను కాలరాసేలా ఏపీ ఏకపక్షంగా ముందడుగు వేస్తే చూస్తూ ఊరుకోం. హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మాను కుని, న్యాయస్థానాల్లో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సహకరించాలి. లేదంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు” అని సత్యనారాయణ గుండ్లపల్లి హెచ్చరించారు.