14-01-2026 01:26:44 AM
అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మరోసారి తన అభిమానాన్ని చాటుకు న్నారు. పండుగ వాతావరణంలో రాజకీయ సందేశాన్ని వినూత్నంగా ప్రజలకు చేరవేయడంలో ముందడుగు వేశారు. సంక్రాంతి పుర స్కరించుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం ధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఫొటోలతో ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించారు.
గతంలో నూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశం తో ’రైజింగ్ తెలంగాణ’ పేరుతో పలు వినూత్న కార్యక్రమాలను నిర్వహించి మెట్టు సాయికుమార్ గుర్తింపు పొందారు. తాజా పతంగుల కార్యక్రమం కూడా అదే కోవలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.