14-01-2026 01:30:15 AM
రౌనక్ ఎస్టేట్‌లో 9వ నిజాం రౌనక్ యార్‌ఖాన్ ఆధ్వర్యంలో హిందూ, --ముస్లింల సంబురాలు
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): హిందూ--ముస్లిం ఐక్యత, సద్భావన సందేశాన్ని ప్రతిబింబించే సంక్రాంతి వేడుకలు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని రౌనక్ ఎస్టేట్‌లో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. ఆసఫ్‌జాహీ వంశానికి చెందిన 9వ నిజాం, ఎస్టేట్‌ల కస్టోడియన్ హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ ఈ వేడుకలకు ఆతిథ్యం అందించారు. వివిధ మతాలు, వర్గాలకు చెంది న ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో హైదరాబాద్‌కు చిరకాలంగా ఉన్న సౌహార్దం, సహ జీవనం, సంయుక్త సాంసృ్కతిక వారసత్వం మరోసారి ప్రతిఫలించింది. విశాలమైన రౌనక్ ఎస్టేట్‌ను సంప్రదాయ సంక్రాంతి రంగులతో అలంకరించారు.
భోగి మంటలు, సూర్య దేవునికి పూజలు, సంప్రదాయ రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, జానపద నృత్యాలు, పిల్లలు--పెద్దలు కలిసి పతంగులు ఎగురవేయడం, శాంతి కోసం వేద మంత్రాల పఠనం వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్ మా ట్లాడుతూ.. “కృతజ్ఞత, పంచుకోవడం, సమృద్ధిని ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. అన్ని మతాల వారు కలిసి ఈ పండుగను జరుపుకోవడం ద్వారా ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావమే మన దేశ బల మని చాటుతున్నాం. సమగ్ర సంసృ్కతికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్య త” అని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆరవ నిజాం అయిన మిర్ మహబూబ్ అలీఖాన్ గారి లౌకిక వారసత్వానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో హిస్ హైనెస్ రౌనక్ యార్ ఖాన్‌తో పాటు జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయవిహారం రమణమూర్తి సౌహార్దం, సోదరభావంపై సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని జైహో (జైభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటెగ్రిటీ, హార్మనీ ఞ ఒనెస్ -- ట్విన్ సిటీస్ యూనిట్) నిర్వహించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో 12 రాష్ట్రాల్లో జైహో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.