అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠాలోని ఒకరిపై పీడీ యాక్ట్ అమలు
దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన రెండు కేసుల్లో నిందితుడికి నిర్బంధ ఉత్తర్వులు
ఒక సంవత్సర కాలం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం
తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై పిడి యాక్ట్ తప్పదు
జిల్లా ఎస్పి ఎం. రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): నకిలీ నోట్ల తయారీ ముఠా లోని ఒకరి పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించి ఎనిమిది మంది నిందితులను అక్టోబర్ 11న అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు మధ్యప్రదేశ్ కి చెందిన కాట్ని అలియాస్ లఖన్ కుమార్ దుబే పై కామారెడ్డి కలకత్తాలో కేసులు ఉన్నట్లు తెలిపారు.
ఇతనిపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. నిజాంబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లకన్ కుమార్ దూబే కు పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి పీడీ యాక్ట్ తరఫున అందజేసినట్లు తెలిపారు. తరచుగా చోరీలకు పాల్పడుతూ సమాజంలో అస్థిరత భయం సూచించే వారిని నిర్బంధించేందుకు పిడిఎఫ్ ను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఏడాది వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. నేరాలు మానుకొని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని ఎస్పి సూచించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ ఎలాంటి వెనకంగా వేయదని ఆయన తెలిపారు.
కామారెడ్డి టౌన్ PS పరిధిలోని వైన్స్‌లో రెండు నకిలీ ₹500 నోట్లు వినియోగించిన ఘటనపై మేకల అఖిల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా Cr.No.551/2025, U/s 179, 318(4) BNS కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన జిల్లా పోలీసులు తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 8 మంది నిందితులను 11.10.2025 నాడు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్ని @ లఖన్ కుమార్ దుబే (33) మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇట్టి నిందితునిపై కామారెడ్డి మరియు కోల్‌కతాలో కూడా కేసులు నమోదు అయినవి. ప్రస్తుతం ఇతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నాడు. జిల్లా కలెక్టర్, కామారెడ్డి గారు జారీ చేసిన PD యాక్ట్ ఉత్తర్వులను, కామారెడ్డి టౌన్ SHO నరహరి, హెడ్ కానిస్టేబుల్ వి.ఎల్. నర్సింలు గారు ఈ రోజు తేది: 21.11.2025 న జైలులో ఉన్న నిందితునికి అధికారికంగా అందజేశారు. ఈ నిందితుడు ఫేక్ కరెన్సీ చలామణి ద్వారా ప్రజల్లో భయం, అనిశ్చితిని సృష్టిస్తూ, సమాజ అశాంతి నెలకొల్పుతున్న నేపథ్యంలో, తిరిగి శాంతి, భద్రతను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో పి డి యాక్ట్‌ను అమలు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం నిందితుడు ఒక సంవత్సరం వరకు నిర్బంధంలో ఉండే అవకాశం ఉంది.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ... అమాయక ప్రజలను మోసం చేసి, నేరస్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అక్రమంగా డబ్బులు సంపాదించేలా తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమాజంలో అస్థిరత, భయం సృష్టించే వారిని నిర్బంధించేందుకు పి డి యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేస్తాము అని తెలిపారు. నేరాలు మానుకుని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ ఎలాంటి వెనుకంజ వేయదు అని స్పష్టం చేశారు.






