22-11-2025 12:15:31 AM
నేషనల్ మాస్టర్స్ అక్వాటిక్ ఛాంపియన్షిప్-2025 షురూ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం అక్వాటిక్ స్విమ్మింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం 21వ నేషనల్ మాస్టర్స్ అక్వాటిక్ ఛాంపియన్షిప్- 2025 ఈతల పోటీలు ప్రారం భమయ్యాయి. ఈ పోటీలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరుగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు నుంచి అన్ని వయస్సుల వారు ఈ పోటీలలో పాల్గొన్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. 25-30 ఏళ్ల వయస్సు నుంచి 80--85 వయస్సు ఉన్న వారు కూడా పాల్గొంటున్నారు. మొదటి రోజు జరిగిన పోటీల్లో విజేతలకు పలువురు ప్రముఖులు మెడల్స్, సర్టిఫికెట్‌లను అందించారు.
70--75 ఏజ్ గ్రూప్‌లో విజేతలకు ప్రముఖ తెలుగు దినపత్రిక విజయక్రాంతి బ్యూరో చీఫ్ ఎక్కల్ దేవి శ్రీనివాస్ మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సెవెన్ సీస్ ఎండీ ఎల్ ఏం శంకర్, స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఉమేష్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.