28 June, 2026 | 3:48 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

దేశ రాజకీయాలని మార్చేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో కుట్ర

19-04-2026 03:42 PM

బోథ్,(విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ పేరుతో భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాలను మార్చేందుకు కుట్ర పన్నిందని బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ విమర్శించారు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి ఆలస్యం చేయకుండా గతంలో 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే బిజెపి మాత్రం కుట్రలతో బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.

బిల్లులో ఓ బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించకపోవడం పెద్ద లోపమని ఆయన విమర్శించారు ,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మహిళా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి అన్నారు. సమావేశంలో బోత్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మెరుగు నరసింహ దాస్, మాజీ ఎంపీటీసీ కురుమే మహేందర్. సహకార సంఘం మాజీ డైరెక్టర్ చట్ల ఉమేష్, మెరుగు భోజన్న, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, కొట్టాల తిరుపతిరెడ్డి, పూండ్రు విజయ రెడ్డి తదితరులు ఉన్నారు.