ఆర్టీసీ పరిరక్షణ కోసమే సమ్మె
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజా రవాణా రంగంలో కీలకంగా ఉన్న ఆర్టీసీని నిర్విజయం చేసినందుకు ప్రభుత్వం కుట్ర పన్నడంతోనే పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్నట్టు టీఎంయు రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర రామచంద్ర రెడ్డి అన్నారు. గతంలో కెసిఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు అబద్దాలతో మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ పరిరక్షణపై స్పష్టమైన హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రెండున్నర సంవత్సరంలో కష్టాలు, నష్టాలు తప్ప ఆర్టీసీ పరిరక్షణకు ఏమాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను విన్నవించిన పరిష్కరించకపోవడం వల్లనే ఈనెల 22 నుంచి సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపాలని ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు






